ఈసీకి కాంగ్రెస్ బృందం డిమాండ్
Term: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయదలచుకున్న తమ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం అసాధారణమని, దానిని వెంటనే సరిచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, జైరాం రమేశ్, అభిషేక్ మనుసింఘ్వి, వివేక్ తన్ఖా, రణదీప్ సూర్జేవాలా, భూపేశ్ బఘెల్, దీపా దాస్‌మున్షీ తదితరులతో కలిసి మీనాక్షి బుధవారం కేంద్ర ఏ ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణతో ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లయిందని, రాజ్యాంగ సంస్థలపై తమకు ఇంకా విశ్వాసం ఉండటంతోఈ పోరాడుతున్నామని మీనాక్షి విలేకరులకు చెప్పారు. 2+2=7 ఉత్తర్వు ఉందని సింఘ్వి వ్యాఖ్యానించారు. ” రెండేళ్లకు పైగా శిక్షపడే కేసుల వివరాలు మాత్రమే అఫిడవిట్లో పేర్కొనాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోంది. ముందుగా అభియోగాలు నమోదుకావాలి. మీనాక్షి విషయంలో ఒక ప్రైవేటు కేసును చూపించారు. ప్రైవేటు ఫిర్యాదు నిరాధారం కావచ్చు. దానిని న్యాయమూర్తి ఇంకా పరిఖ తీసుకోలేదు. కేవలం నోటీసు పంపించారు. ఇది క్రిమినల్ కేసు కాదని న్యాయశాస్త్ర తొలిఏడాది విద్యార్థులకూ తెలుసు. ను తిరస్కరిస్తే న్యాయం చేయడానికి ఈసీకి అన్ని అధికారాలూఉన్నాయి. వాటిని ఉపయోగించి తపాలి” చెప్పారు.
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష
తమ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో మధ్యప్ర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు బుధవారం భోపాల్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. భాజపా ఒత్తిడితో ఒక పథకం ప్రకారం కుట్రచేసి నామినేషన్‌ను తిరస్కరించారని వారు ఆరోపించారు.
