Time Room

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ.. & more related news here

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ..

 & more related news here


ABN, publication date: March 9, 2026 | 14:30

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku wignyapthi) ప్రీమియర్‌కు సిద్ధమైంది.

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku wignyapthi) ప్రీమియర్‌కు సిద్ధమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుూరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. వినోదంతో పాటుగుండెల్ని తాకే భావోద్వేగాలతో కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే!

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13న జీ 5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఈ సినిమాలో హాస్యంతో పాటు చక్కని భావోద్వేగం ఉంటుంది. కిషోర్ తిరుమల దీనిని వినోదాత్మకంగా, అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ చిత్రమిది. దక్షిణాది ప్రాంతాల ప్రేక్షకులు దీనిని సొంత భాషలో వీక్షించి ఆనందించేలా జీ5లోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.

Update date: March 9, 2026 | 16:41



Source link

Exit mobile version