By function desk
Updated: June 29, 2026 17:09 IST
1 minute read

ఇంటర్నెట్ డెస్క్: త్రిభాషా విధానం అమలుపై CBSE (CBSE) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం మూడు భాషలు చదవాలనే నిబంధన (3 language policy) నుంచి మినహాయింపు ఇచ్చింది. 2026-27 తరగతి విద్యార్థులకు ఒకసారే వర్తించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విద్యార్థులు రెండు విదేశీ భాషలు.. ఒక భారతీయ భాషను చదవొచ్చని తెలిపింది.
1 నుంచి 9 వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు (3 language policy) అభ్యసించాలని ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న తెలిసిందే. ఈ ఆదేశాలపై పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ తాజా ప్రకటన చేసింది. ”ప్రస్తుత 10వ తరగతి బ్యాచ్ త్రిభాషా విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాగే, ప్రస్తుతం 7 నుంచి 9 తరగతుల్లో ఉన్న విద్యార్థులు 10 min థర్డ్ లాంగ్వేజీ బోర్డు పరీక్షలు ”’ అని సీబీఎస్‌ఈ అకడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞా ఎం. సింగ్ తెలిపారు. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏర్పాటు చేశామని… ప్రతిభ ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
Posted: Jun 29, 2026 16:56 IST
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. ” కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
