Time Room

Rain: చల్లని కబురు.. వర్షం & more related news here

Rain: చల్లని కబురు.. వర్షం

 & more related news here


హైదరాబాద్‌: ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్‌ ప్రజలను వరుణుడు సాంత్వన పరిచాడు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. చింతల్‌లోని పద్మానగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

కూకట్‌పల్లి, మూసాపేట్‌, జేఎన్టీయూ, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోనఱ వాతావరణం మారిపోయింది. న్యూ బోయిన్‌పల్లి, లోతుకుంట, తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.



Source link

Exit mobile version