Time Room

tg inter results: చెక్ చేసుకోండిలా.. & more related news here

tg inter results: చెక్ చేసుకోండిలా..

 & more related news here


By function desk
Updated: April 12, 2026 00:53 IST

1 minute read

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాల (Inter Results 2026) విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రయత్నmin వచ్చినప్పటికీ.. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి (విద్యాశాఖ) యోగితా రాణా ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 ఇంటర్‌ పరీక్షలు జరగ్గా.. తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. www.eenadu.net, https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందొచ్చు.

మరోవైపు, ఇంటర్‌ విద్యార్థులు తమ (tg inter results on whatsapp) నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఫలితాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సప్‌లోనే పొందేలా ఏర్పాటు చేసింది. స్మార్ట్‌ ఫోన్‌లలో 80969 58096 ‘Hello’ అని మెసేజ్‌ చేసి ‘BIE Exam Result’ చేసుకోవచ్చు.



Posted: Apr 11, 2026 16:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివి దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. ” కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



Source link

Exit mobile version