ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్‌ను కేవలం 60 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో పూర్తి చేసేలా వంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి మూడు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్పిరిట్ కోసం బల్క్ కాల్షీట్స్ కేటాయించారు. ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

వంగా మార్క్ ‘లాంగ్ షెడ్యూల్’
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రభాస్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, ఏకధాటిగా 60 రోజుల పాటు ఒక లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఒక్క షెడ్యూల్‌తోనే సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ భాగాన్ని పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. సందీప్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కంటే రా అండ్ రస్టిక్ ఎమోషన్స్‌కే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ఈ నాన్ స్టాప్ షెడ్యూల్ ద్వారా కథలోని కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నారు. ఇద్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకునే అవసరం ఉండదని భావిస్తున్నారు.
* ఫిల్మ్ ఛాంబర్ వేదికగా నేడు కీలక చర్చలు
ప్రభాస్ ‘మూడు పడవల ప్రయాణం’
ప్రస్తుతం ప్రభాస్ డైరీ చూస్తే అభిమానులు షాక్ అవ్వాల్సిందే. ఒకే సమయంలో ఆయన మూడు భారీ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కోసం బల్క్ కాల్షీట్స్ కేటాయించినప్పటికీ, అదే సమయంలో ‘ఫౌజీ’ (Fauzi), నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ చిత్రాల షూటింగ్ పనుల్లో కూడా పాల్గొనాల్సి వస్తోంది. ఇలా మూడు పడవల ప్రయాణం చేస్తున్నా.. క్వాలిటీ తగ్గకుండా ప్రభాస్ ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారు.
* నాగవంశీ.. ‘డూప్లికేట్ హెయిర్ ఉండే ‘ప్రొడ్యూసర్’
మునుపెన్నడూ చూడని పాత్రలో..
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. అయితే తాజా లీకుల ప్రకారం.. ఒక బలమైన కారణం వల్ల జైలుకు వెళ్ళిన పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుందని సమాచారం. ‘యానిమల్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వయొలెన్స్ పరిచయం చేసిన వంగా ఇప్పుడు ప్రభాస్ కటౌట్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విఠ చేస్తోంది. ఎనిమిది భాషల్లో రాబోతున్న న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి ఆ 60 రోజుల షెడ్యూల్‌లో వంగా మార్క్ టేకింగ్, ప్రభాస్ రా అండ్ రస్టిక్ లుక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే!

