Tanikella Bharani on PM Modi: నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. మోదీని రాముడు, కృష్ణుడు, వివేకానందుడి అంశగా అభివర్ణించిన భరణి.. ఆయన చేతిని ముద్దాడటంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. గతంలోలూ భారతీయ సంస్కృతికి దక్కుతున్న గౌరవం పట్ల తన అచంచలమైన విశ్వాసాన్ని తనికెళ్ల భరణి వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న ప్రేమాభిమానాలను, గౌరవాన్ని తనికెళ్ల భరణి తాజాగా పోస్ట్ పెట్టారు. మోదీని రాముడు, కృష్ణుడు, ఆదిశంకరుడు, వివేకానందుడితో పోల్చారు. మోదీని నేరుగా చూడటమే కాదు, ఆయన చేతిని ముద్దాడానని, తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. ” ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. ” చేశారు. ప్రధానితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నారు.
హిందూత్వ భావజాలం, శివతత్త్వం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన తనికెళ్ళ భరణి.. మోదీని పురాణ పురుషుల అంశగా పోల్చడం చర్చనీయాంశంగా మారింది. భరణి గతంలోనూ పలు సందర్భాల్లో మోదీ గొప్పదనాన్ని కొనియాడారు. More information. › వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మోడీ ఆదివారం (మే10) పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి తెలంగాణ పర్యటన. సుమారు ఏడు గంటలపాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకొంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హెటిర౫ ప్రారంభించారు. తిరీ మోడీని కలిశారు తనికెళ్ల భరణి. ఈ సందర్భంగా మోడీకి నమస్కారం చేయగా, ప్రధాని ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. ఈ ఫొటోనే భరణి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
తనికెళ్ల భరణి కేవలం నటుడిగానే కాకుండా కథా రచయితగా, దర్శకుడిగా, కవిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ముఖ్యంగా డైలాగ్ రైటర్‌గా ‘శివ’, ‘మనీ’ వంటి చిత్రాలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. నటన, రచన విభాగాల్లో ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది.

