బాలుడి ప్రాణాలు బలిగొన్న విద్యుత్తు నిర్లక్ష్యం & more related news here

బాలుడి ప్రాణాలు బలిగొన్న విద్యుత్తు నిర్లక్ష్యం

 & more related news here


మరమ్మతులకు స్తంభం ఎక్కించో విద్యుదాస

షాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడగా మరమ్మతులు చేయాల్సిన సిబ్బంది బాలుడిని స్తంభం ఏ ప్రాణాలు బలిగొన్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. షాబాద్‌లో సోమవారం ఉదయం బ్రేక్‌డౌన్‌ అయ్యి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. స్థానిక ధ్యానహిత పాఠశాల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సమస్య తలెత్తిందని తెలిసి అసిస్టెంట్‌ లైన్‌మన్‌ సాజిద్, ఆర్టిజన్‌ జంగయ్య.. షాబాద్‌కు చెందిన దర్జీ శేఖర్‌ కుమారుడు సాయితేజ(17)ను వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. సాయితేజతో మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ సరఫరా కావడంతో బాలుడు విద్యుత్‌ తీగలపైనే చనిపోయాడు. వారిద్దరూ మృతదేహాన్ని కింథ పారిపోయారు. ప్రమాదానికి కారణమైన లైన్‌మన్‌పై చర్యలు తీసుకోవాలని డీఈ రమేశ్‌ను ఆదేశించినట్లు టీజీఎస్పీడీసీఎల్‌ సైబర్‌సిటీ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ తెలిపారు. ఎల్‌సీ తీసుకున్నాక కరెంట్‌ ఎలా సరఫరా అయ్యిందనే దానిపై విచారణ చేస్తున్నామని డీఈ చెప్పారు. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *